EETALA: కవిత కారు దిగాల్సిందే: ఈటల

ఎమ్మెల్సీ కవిత లేఖ లీక్స్‌పై బీజేపీ ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు ఒకరిపై ఒక్కసారి నెగటివ్ ఒపినీయన్ వస్తే ఇక అంతే సంగతులు అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కవిత కొనసాగే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా చెబుతున్నానని, కవిత ఇష్యూ అతికే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఆమె కారు దిగాల్సిందేనని, ఆ పరిస్థితిని కవిత తెచ్చుకున్నారని చెప్పారు. **”కేసీఆర్ దగ్గర.. ఒక మనిషి నెగటివ్ అభిప్రాయం కలిగించుకున్నాక.. అతకడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కూతురి మీద కూడా ఎక్కడో నెగటివ్ ఒపీనియన్ వచ్చి ఉంటుంది. కవిత ఇక అతికే ప్రసక్తే లేదు” అని ఈటల చెప్పారు.
కేసీఆర్ వారసుడు కేటీఆర్: జగ్గారెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిప్రెషన్లో తొందరపడి లేఖ విడుదల చేశారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. తండ్రి కేసీఆర్ మీద ఆమె దండయాత్ర చేస్తుందన్న ఆయన.. కవిత స్వతహాగా ఎదిగిన లీడర్ కాదని చెప్పుకొచ్చారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, ఏ చరిత్ర చూసినా కొడుకే రాజకీయ వారసుడుగా వస్తారన్నారు. కొడుకు ఉండగా కూతురికి వారసత్వం దక్కదని, బీఆర్ఎస్ పార్టీలోనూ అదే జరుగుతుందని జోష్యం చెప్పారు. ‘తెలంగాణలో ఏదో జరిగిపోతుందనే చర్చ జోరుగా సాగుతుంది. కొత్త పార్టీ అనే చర్చ అన్ని రాజకీయ పక్షాల్లో నడుస్తుంది. కవిత లేఖతో కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదు. కాంగ్రెస్ ఆనాటి నుండి ఈనాటి వరకు బలంగా ఉంది.. భవిష్యత్‌లోనూ బలంగానే ఉంటుందని" జగ్గారెడ్డి వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com