ఈటలతో బీజేపీ నేతలు భేటీ..

అధికార పార్టీ నేత అన్యాయంగా బుక్ చేశారంటూ ఈటల రాజేందర్ బాధ పడ్డా పట్టించుకునే వారు లేరు. ఈ ఆపత్కాల సమయంలో మేమున్నామంటూ ఈటలను అక్కున చేర్చుకోడానికి భారతీయ జనతా పార్టీ రెడీ అయిపోయినట్లు కనబడుతోంది.
తన రాజకీయ భవిష్యత్ అంధకారం కాకుండా ఉండాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాలి. టీఆర్ఎస్ తరువాత అతి పెద్ద పార్టీ అంటే బీజేపీ. ఇక ఆ పార్టీలోని కీలక వ్యక్తి కిషన్ రెడ్డితో భేటీ. దీంతో త్వరలోనే మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ తో కలిసి ప్రత్యేక విమానంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు.
మొయినాబాద్ లోని వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ లో బీజేపీ ముఖ్య నేతలు, ఈటల రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో జితేందర్ రెడ్డి, వివేక్, డీకే అరుణ, మరో మాజీ ఎంపీ, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. ఇక బీజీపే జాతీయ నేత హామీతో ఈటల ఆ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.
పలు పార్టీలకు చెందిన నేతలు ఈటలతో చర్చించినా తుది నిర్ణయం ఏం తీసుకుంటారనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com