Eetela Rajender: పిలిస్తే కదా వచ్చేది : కేటీఆర్ కు ఈటల జవాబు

గవర్నర్ స్పీచ్‌కు ముందు తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందనరావు, రాజాసింగ్ వద్దకొచ్చి మాట్లాడారు మంత్రి కేటీఆర్. ఎమ్మెల్యే ఈటలతో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. హుజురాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పిలిస్తే కదా హాజరయ్యేదంటూ సమాధానం ఇచ్చారు ఈటల. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్ సరిగాలేదని మంత్రి కేటీఆర్‌కు చెప్పారు ఈటల.
ఈటల, కేటీఆర్ సంభాషణ మధ్యలో ఎంట్రీ ఇచ్చారు సీఎల్పీ నేత భట్టి. తనను సైతం అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని ప్రస్తావించారు. కనీసం కలెక్టరేట్ అయినా ఆహ్వానించాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు ఈటల. ఈ వ్యాఖ్యలకు నవ్వి ఊరుకున్నారు కేటీఆర్. ఆ సమయంలో... గవర్నర్ సభలోకి వస్తున్నారంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య... అలర్ట్ చేయడంతో కేటీఆర్... తన ట్రెజరీ బెంచీ వైపు వెళ్లిపోయారు. కేటీఆర్ కంటే ముందు... ఈటల వద్దకు వచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com