EFLU Student Suicide: 4 అంతస్థులపై నుంచి దూకి...

EFLU Student Suicide: 4 అంతస్థులపై నుంచి దూకి...
ఎంఏ ఇంగ్లీష్ చుదువుతోన్న విద్యార్థిని; ఫోన్ లో అమ్మతో మాట్లాడుతూనే...

హైదరాబాద్ లో విద్యార్ధిని ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఇఫ్లూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న అంజలి అనే విద్యార్ధిని హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.


హర్యాణాకు చెందిన 22ఏళ్ల అంజలి ఇఫ్లూలో ఎంఏ ఇంగ్లీషు చదువుతోంది. తల్లితో ఫోన్ లో మాట్లాడుతున్న అంజలి అకస్మాత్తుగా ఎంబీసీ హాస్టల్ భవనం 4వ అంతస్థుకు వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేసింది. ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది.


సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన క్యాంపస్ కు చేరుకున్నారు. అంజలి మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం గాంథీ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు ప్రారంభించారు. అంజలి ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు.

Tags

Next Story