దుబ్బాక బైపోల్‌పై ఎన్నికల సంఘం నజర్

దుబ్బాక బైపోల్‌పై ఎన్నికల సంఘం నజర్
X
దుబ్బాక ఉపఎన్నికను పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అడపాదడపా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి..

దుబ్బాక ఉపఎన్నికను పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అడపాదడపా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. దుబ్బాకలో కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు కవాతు చేశాయి. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని భరోసా నిచ్చాయి. మరోవైపు.. దుబ్బాక బైపోల్‌పై నజర్‌ పెట్టిన ఎన్నికల సంఘం.. ఎన్నికల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేక అధికారిని నియమించింది. తమిళనాడు ఐపీఎస్‌ అధికారి సరోజ్‌ కుమార్‌ను.. శాంతిభద్రతల పరిశీలకుడిగా నియమించింది.

Tags

Next Story