Electricity Amendment Bill: నేడు రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ సరఫరా నిలిచిపోయే అవకాశం..

Electricity Amendment Bill: కేంద్రం తీసుకువస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై విద్యుత్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. మోదీ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా ఇవాళ మహాధ ర్నాకు పిలుపునిచ్చారు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు. విధులకు హాజరు కాకపోతుండడంతో ఇవాళ తెలంగాణలో విద్యుత్ సరఫరాపై ఈ ప్రభావం పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ రాష్ట్రం అంతా విద్యుత్ సరఫరా నిలిచిపోతే పునరుద్ధరించడం కష్టం అవుతుందన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వినియోగదారులు సహకరించాలని విద్యుత్ ఉద్యోగులు ప్రజలను కోరుతున్నారు.
విద్యుత్ చట్ట సవరణ చట్టంపై ద్వారా తమకంటే కూడా విద్యుత్ వినియోగదారులకే ఎక్కువ నష్టం అని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. తమ ఆందోళనలను లెక్క చేయకుండా మోదీ సర్కార్ మొండిగా విద్యుత్ చట్టం సవరణ సవరణ బిల్లును ప్రవేశపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. చట్టం ప్రవేశపెడితే విధులను పూర్తి స్థాయిలో బహిష్కరిస్తామని స్పష్టం చేస్తున్నారు.
కేంద్రం తీసుకువస్తున్న విద్యుత్ విధానాలపై మండిపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్ర విధానాల కారణంగా విద్యుత్ ఉద్యోగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడంపై మండిపడ్డారు కేసీఆర్. ఈ బిల్లుతో ప్రైవేట్ సంస్థలకు ఎలాంటి ఖర్చు లేకుండా అదే విద్యుత్ లైన్ నుంచి కరెంట్ సరఫరా చేసే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. వినియోగదారుల నుంచి వసూలు చేసే ఛార్జీలు అధికం అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com