Casino : నేపాల్ క్యాసినోలో పాల్గొన్న సెలబ్రెటీలు ఎవరంటే..

Casino : క్యాసినో ఈవెంట్లు నిర్వహిస్తున్న హైదరాబాదీ డీలర్లు, ఏజెంట్లే లక్ష్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. నేపాల్‌లో పెద్ద ఎత్తున క్యాసినో నిర్వహిస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో 8 చోట్ల దాడులు జరిపి... కీలక ఆధారాలతో పాటు.. ప్రముఖులతో ఉన్న లింకులను సైతం గుర్తించారు.
హైదరాబాద్ ఐఎస్ సదన్‌లోని చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కేసినో ఆడించడంలో చికోటి ప్రవీణ్ దిట్టగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో చికోటి ప్రవీణ్ పైన సిబిఐ కేసు నమోదు చేసింది. తాజాగా చికోటి ప్రవీణ్ ఇంటి ఫై ఈడీ దాడులు చేయడం సంచలనంగా మారింది.
ఫెమా కింద కేసు నమోదు చేసిన ఈడీ.. హైదరాబాద్‌లో మొత్తం 8 చోట్ల దాడులు చేస్తోంది. గతంలో హైదరాబాద్, విశాఖ, విజయవాడ, గుడివాడ కేసినో కేసుల్లో ఆరోపణలు ఎదురుకున్నారు ప్రవీణ్. కేసినో వ్యవహారంలో బోయిన్‌పల్లిలోని మాధవరెడ్డి ఇంట్లో కూడా ఈడీ దాడులు చేసింది.
గత నెల 10, 11, 12, 13 తేదీల్లో నేపాల్‌లోని హోటల్ మేచీ క్రౌన్‌లో కేసీనో నిర్శహించాడు మాధవ రెడ్డి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానాల ద్వారా నేపాల్‌కు పేకాట రాయిళ్ళను తరలించినట్టు తెలుస్తోంది. నేపాల్, ఇండోనేషియా, పుక్కెట్‌లో క్యాసినోలు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది.
క్యాసినోలలో టాలివుడ్, బాలీవుడ్, నేపాలీ డ్యాన్సర్ల చిందులు వేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫెమా కింద కేసు నమోదు చేసిన ఈడీ.. దాడులు చేస్తోంది. గతంలో బర్త్ డే పేరుతో ఖరీదైన పార్టీలు ఇచ్చిన వీడియోలు సైతం హల్ చల్ చేస్తున్నాయి.
అటు శ్రీలంకకు చెందిన క్యాసినో సంస్థలతో ప్రవీణ్, మాధవరెడ్డి బృందం అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. డబ్బంతా హవాలా మార్గంలో శ్రీలంకకు తరలించినట్లు ఈడీ అధికారులు తేల్చారు.
ఇక క్యాసినో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌కి సెలబ్రిటీలతో సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. 10 మంది సినీ తారలను నేపాల్‌కు రప్పించినట్లుగా గుర్తించారు. వారితో జరిగిన ఆర్థిక లావాదేవీపై ఫోకస్ పెట్టారు.
టాలీవుడ్, బాలీవుట్ హీరో హీరోయిన్లు మొత్తం 10 మంది... నేపాల్‌లో జరిగిన క్యాసినోకు హాజరైనట్లు సమాచారం. క్యాసినోలో పాల్గొన్న వారిలో అమేషా పాటిల్, మేఘన నాయుడు, విల్సన్, గోవిందు, ముమైత్‌ఖాన్, మల్లికా షరావత్, సింగర్ జాన్సీరాజు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలతో చికోటికి సంబంధాలు ఉన్నట్లు ఈడీ గుర్తించారు. మొత్తానికి చికోటి ఎపిసోడ్‌లో తవ్వేకొద్దీ నిజాలు బయటపడుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com