Entertainment: హైజీన్ ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన ప్రముఖ నటి ఇంద్రజ

Entertainment: హైజీన్ ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన ప్రముఖ నటి ఇంద్రజ
మహిళల సౌకర్యార్థం అనేక ఉత్పత్తులను ప్రవేశ పెట్టిన సురభి సంస్థ; సులభంగా అందుబాటులోకి కొత్త ప్రోడక్ట్స్...

వేగంగా మారుతున్న కాలానికి తగినట్లే మహిళలకు ప్రత్యేక హైజెనిక్ ఉత్పత్తులతో పాటూ ఆత్మరక్షణ ఉత్పుత్తుల అవసరం కూడా పెరుగుతూనే ఉంది. అయితే అన్ని విధాలా శ్రేయస్కరమైన ఉత్పత్తులు మార్కెట్ లో దొరకడం కష్టమే అవుతోంది. అయితే సరసమైన ధరలకు నాణ్యమైన హైజెనిక్ ప్రాడెక్ట్ లను అందించేందుకు ప్రముఖ సంస్థ ముందడుగు వేసింది. ఈ కొత్త ప్రొడక్ట్‌లను నటి ఇంద్రజ లాంచ్ చేశారు. సురభి హైజీన్ ప్రొడక్ట్స్‌లో భాగంగా మూడు రకాల కొత్త ఉత్పత్తులను లాంచ్ చేశారు. సురభి శానిటరీ న్యాప్‌కిన్స్, గ్రో వుమెన్ మెన్‌స్ట్రుయల్ కప్, ఐయామ్ అలర్ట్ పెప్పర్ స్ప్రేను నేడు మార్కెట్లోకి విడుదల చేశారు. మహిళలకు ఉపయోగపడే ఈ ఉత్పత్తులు సులభంగా అందేలా ఆన్ లైన్‌లోనూ పొందుపర్చినట్టుగా తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story