Errabelli Pradeep : బీజేపీలో చేరిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు..

Errabelli Pradeep : బీజేపీలో చేరిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు..
X
Errabelli Pradeep : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Errabelli Pradeep : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.. ప్రదీప్‌రావు వెంట తరుణ్‌ చుగ్‌, గరికపాటి మోహన్‌రావు ఉన్నారు.. ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతోపాటు బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి, వీటీ విజయ్‌కుమార్‌, యోగానంద్‌ కూడా బీజేపీలో చేరారు.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని ప్రదీప్‌రావు చెప్పారు.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ బలంగా ఉందని, అధికారంలోకి వచ్చేందుకు మంచి అవకాశం ఉందని అన్నారు.

Tags

Next Story