ETALA: కాళేశ్వరానికి బాస్ కేసీఆర్: ఈటల

ETALA: కాళేశ్వరానికి బాస్ కేసీఆర్: ఈటల
X
కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల.. కణతపై తుపాకీ పెట్టినా నిజాలే చెప్తా: ఈటల

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో అవకతవకలపై ఈటల రాజేందర్‌.. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో విచారణకు హాజరైన మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, కమిషన్ చైర్మన్ పీ చంద్రఘోష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సుమారు 20 నిమిషాల పాటు ఈటల రాజేందర్‌ను కమిషన్ విచారించింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.. కాళేశ్వరం డిజైన్లతో తనకు సంబంధం లేదని.. అంతా ఇరిగేషన్ శాఖ చేసుకుందని అన్నారు. కాళేశ్వరం బాధ్యులను శిక్షించాలని అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ తో కూడా ఆర్థిక మంత్రికి సంబంధం ఉండదని అన్నారు. బడ్జెట్ కేటాయింపులు మాత్రమే ఆర్థిక శాఖ బాధ్యత అని... కేటాయింపుల ప్రకారమే నిధులు ఇచ్చామని అన్నారు. కాళేశ్వరం డిజైన్, నిర్మాణం అంతా తానే చేసుకున్నట్లు కేసీఆర్ చెప్పారని.. అన్ని నిర్ణయాలకు కేసీఆర్ బాస్ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా, కేబినెట్‌‌ నిర్ణయం మేరకు నిధులు విడుదల చేశానని స్పష్టం చేశారు. నిధుల విడుదల విషయంలో తన సొంత అజెండాలు ఏమి లేవని అదే విషయాన్ని కాళేశ్వరం కమిషన్‌కు ఎదుట స్పష్టం చేశానని అన్నారు. నిధులు ఎవరికి ఇవ్వాలో కూడా ఇరిగేషన్ శాఖ పరిధిలోనే జరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తానేమీ చేయలేదని, తన దగ్గర ఏమీ లేదని అన్నారు.

విలువలతో ఉన్నా

‘‘తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నాను. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పని చేశా. రీ డిజైన్‌ కోసం కేసీఆర్‌ వేసిన సబ్‌ కమిటీలో మేం ఉన్నాం. 2016లో తుమ్మడిహట్టి అంచనా రూ.16,500 కోట్లు. ఆ తర్వాత 2015లో ఆ అంచనా రూ.38 వేల కోట్లకు పెరిగింది. ..తుమ్మడిహట్టిపై మహారాష్ట్ర అభ్యంతరం తెలిపింది. తుమ్మడిహట్టితో నీటి అవసరాలు తీరవని రిపోర్టులు వచ్చాయి. మూడు బ్యారేజి CWC రిపోర్ట్, టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో బ్యారేజీలు కట్టారు. సబ్ కమిటీ, టెక్నికల్ కమిటీ రిపోర్టు ఆధారంగా కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి రూ.63వేల కోట్ల అంచనాతో ప్రారంభం అయ్యింది. అయితే..రైతుల డిమాండ్ మేరకు రూ. 82వేల కోట్లకు పోయింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం పెట్టారని నన్ను అడిగారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కి ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని చెప్పాను.

Tags

Next Story