Etala Rajender: ఈటల ఫ్యామిలీ భూ ఆక్రమణ ఆరోపణలపై విచారణ ప్రారంభం

X
By - Prasanna |16 Nov 2021 1:10 PM IST
Etala Rajender: మాజీ మంత్రి ఈటల ఫ్యామిలీ భూ ఆక్రమణ ఆరోపణలపై విచారణ ప్రారంభమైంది.
Etala Rajender: మాజీ మంత్రి ఈటల ఫ్యామిలీకి సంబంధించి భూ ఆక్రమణల ఆరోపణలపై విచారణ ప్రారంభమైంది. మెదక్ జిల్లా మాసాయిపేట అచ్చంపేటలో ఇవాళ మళ్లీ సర్వే ప్రారంభమైంది. అచ్చంపేటలోని 130 సర్వే నంబర్‌లో 18 ఎకరాల 20 గుంటల అసైన్డ్ భూమి సర్వే జరుగుతుందన్నారు ఆర్డీవో శ్యాం ప్రకాశ్ రెడ్డి. దీనికి సంబంధించి 11 మంది రైతులకు నోటిసులు ఇచ్చినట్లు చెప్పారు. కోవిడ్ కారణంగా గతంలో కోవిడ్ కారణంగా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ఈ కేసులో ఇవాల్టి నంచి పూర్తి స్థాయి విచారణ, సర్వే జరగనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com