Etela rajendar : కేసీఆర్‌కు హుజురాబాద్ ప్రజలు సరైన బుద్ది చెప్పారు..!

హుజురాబాద్ ఉపఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్... నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనను గెలిపించినహుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. దళిత బంధు వాళ్ళ దగ్గర ఎందుకు రాలేదో నిలదీస్తానన్నారు. ఈటల రాజేందర్. కేసీఆర్ రాక్షస పాలనకు హుజురాబాద్ ప్రజలు సరైన బుద్ది చెప్పారన్నారు. టీఆర్‌ఎస్ నంచి వెళ్లగొట్టాక బీజేపీ తనను అక్కున చేర్చుకుందని తెలిపారు.
తనకు అండగా ఉన్న కేంద్రమంత్రి అమిత్‌షాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈటల.ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టారని, డబ్బులు ఖర్చుపెట్టి ప్రజలను వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిని కల్పించారన్నారు. కుల ప్రస్తావన తెచ్చినా..ప్రజలు తనవైపే నిలబడ్డారన్నారు. దళిత బంధు పది సార్లు ఇస్తామన్నా ధర్మం వైపే ప్రజలు నిలబడ్డారన్నారు. డబ్బులు పంచినోళ్ళను తన్ని తరిమేశారన్నారు.
హుజురాబాద్‌లో ప్రచారం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడతానని, వాళ్ల నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తానన్నారు ఈటల రాజేందర్. పచ్చని సంసారంలో నిప్పులు పోసినవారి నియోజకవర్గాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు. కుట్రలు చేసేవారు.. ఆ కుట్రలతోనే నాశనం అవుతారన్నారు. హుజురాబాద్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఈటల స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com