Etela Rajender: కేసీఆర్‌పై ఈటల ఫైర్..
లక్షల కోట్ల అవినీతి డబ్బును కేసీఆర్ సంపాదించాడు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర ద్వజమెత్తారు. గవర్నర్‌ను కావాలనే ముఖ్యమంత్రి అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. లక్షల కోట్ల అవినీతి డబ్బును కేసీఆర్ సంపాదించారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల ప్రక్రియను కేసీఆర్ డబ్బుతో ముడిపెట్టారని ఈటల రాజేంద్ర ఆరోపించారు. బై ఎలక్షన్లలో డబ్బులతో ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. హుజురాబాద్ ప్రజలు అర్థం చేసుకుని కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టి గట్టిగా బుద్ది చెప్పారని తెలిపారు. కేసీఆర్‌కు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆయన వెల్లడించారు.
Next Story