Etela Rajender : సిటీ బ్రాండ్ దెబ్బ తీస్తే పుట్టగతులుండవు.. ఈటల ఆగ్రహం

Etela Rajender : సిటీ బ్రాండ్ దెబ్బ తీస్తే పుట్టగతులుండవు.. ఈటల ఆగ్రహం
X

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను అధికార కాంగ్రెస్ పార్టీ దెబ్బ తీస్తోందని మండిపడ్డారు మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్. కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని ఫైర్ అయ్యారు. Lb నగర్ నియోజకవర్గం కొలను శివారెడ్డి నగర్ నుండి మదర్ డైరీ మధ్యలో.. డ్రైనేజీ లింక్ కలవకపోవడం వల్ల చాలా ఏళ్లనుండి సమస్య ఉంది. దీంతో జేసీబీ తెప్పించి దగ్గర ఉండి అడ్డుగా ఉన్న గోడ కూలగొట్టించి.. డ్రైనేజీ లింక్ కలిపేలా చేసి30 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపించారు ఈటల. శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు లేక అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. బిల్లులు రావడంలేదని కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని చెప్పారు. గతంతో టెండర్లు అయిన పనుల బిల్లులు చెల్లించి.. తక్షణమే ఆ పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు ఈటల.

Tags

Next Story