Etela Rajender : కేసీఆర్‌ను ఓడించే వరకు నిద్రపోను : ఈటల రాజేందర్

Etela Rajender : కేసీఆర్ను ఓడించే వరకు నిద్రపోనంటూ సవాల్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదన్నారు. గతంలో నయీం ముఠా బెదిరించినప్పుడే భయపడలేదని.. ఇప్పుడు కేసీఆర్కు ఎలా భయపడతానని విమర్శించారు. అసెంబ్లీలో బీజేపీ హక్కులను కేసీఆర్ ప్రభుత్వం కాలరాసిందని ఈటల ఆరోపించారు. స్పీకర్ ను మరమనిషి అన్నందుకు తనకు కేసీఆర్ శిక్ష వేశారని.. మరి కేసీఆర్ అన్న మాటలకు ఏం శిక్ష వేయాలని ప్రశ్నించారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఏసీలో అవకాశం ఇచ్చేవారని, ఇప్పుడు అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని విమర్శించారు ఈటల.
హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్‌ను తిరస్కరించి తనను అసెంబ్లీకి పంపిస్తే.. కేసీఆర్ మాత్రం తనను సభ నుంచి వెళ్లగొట్టారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చ జరగడం లేదన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సభ ఎప్పుడు జరగలేదని గుర్తు చేశారు ఈటల.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com