Etela Rajender: ఈటల రాజేందర్‌‌కు అమిత్ షా ఫోన్.. కీలక బాధ్యత అప్పగించేనా..?

Etela Rajender: ఈటల రాజేందర్‌‌కు అమిత్ షా ఫోన్.. కీలక బాధ్యత అప్పగించేనా..?
X
Etela Rajender: బీజేపీ నేత ఈటల రాజేందర్‌ కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిశారు..

Etela Rajender: బీజేపీ నేత ఈటల రాజేందర్‌ కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిశారు.. అమిత్‌షా కార్యాలయం నుంచి ఈటలకు ఫోన్‌ వచ్చింది.. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు.. ఇటీవలే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఈటలను ఢిల్లీకి ఆహ్వానించారు అమిత్‌షా.. ఆ సమయంలో పక్కు పిలిచి ఢిల్లీ రావాలని చెప్పారు.. ఇందులో భాగంగానే నిన్న అమిత్‌షా కార్యాలయం నుంచి కాల్‌ వచ్చింది..

దాదాపు అరగంటకుపైగా వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి.. తెలంగాణలో రాజకీయ, పార్టీ వ్యవహారాలపై అమిత్‌షాతో చర్చించారు.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఈటల రాజేందర్‌కు అమిత్‌షా సూచించారు. అయితే, ఈటలను అమిత్‌షా ప్రత్యేకంగా పిలవడం, కీలక బాధ్యత అప్పగించే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags

Next Story