హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో ఈటల సతీమణి సంచలన వ్యాఖ్యలు..!

హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో ఈటల సతీమణి  సంచలన వ్యాఖ్యలు..!
X
హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ మంత్రి ఈటల సతీమణి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ మంత్రి ఈటల సతీమణి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజీపీ అభ్యర్థిగా తానున్నా....లేక ఈటల రాజేందర్ ఉన్నా ఒకటేనని.... గెలిచేది మాత్రం బీజేపీనేని జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండురోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ తరపున ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తోంది ఈటల సతీమణి. ఈటల సతీమణి జమున మొదట చేసిన వ్యాఖ్యలు సంచలనం కావటంతో కొద్దిసేపటికే మాటమార్చారు. ఉపఎన్నికలో ఈటలనే బీజేపీ అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు జమున, ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లోనూ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందరే ఉంటారని మరోమారు తేల్చిచెప్పారు జమున.

Tags

Next Story