అంతా రామమయం కాదు మోదీమయం.. పెళ్లికి వచ్చిన అతిథులకు 'ప్రత్యేక' అభ్యర్థన

బహుమతులు వద్దు.. మీ ఆశీర్వచనాలే ముద్దు.. అని కొందరంటే.. ప్రస్తుతం ఎలక్షన్ల సీజన్ నడుస్తుంది కదా ట్రెండ్ మార్చాలి అని నరేంద్ర మోదీకి ఓటు వేయండి అదే మీరిచ్చే ఉత్తమ బహుమతి అని ఏకంగా పెళ్లి కార్డులో కొట్టించి అందరికీ పంచారు ఓ వ్యక్తి.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన నందికంటి నర్సింలు తన కుమారుడి వివాహం ఏప్రిల్ 4న జరుగుతుందని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఓటు వేయాలని పెళ్లికి వచ్చిన అతిథులను కోరారు.
నర్సింలు ఒక్కగానొక్క కుమారుడు సాయికుమార్ వివాహం మహిమ రాణితో పటాన్‌చెరులో ఏప్రిల్ 4న జరగనుంది. ఈ ఆలోచన గురించి మాట్లాడుతూ, భవన నిర్మాణానికి చెక్క వస్తువుల సరఫరాదారు నర్సింలు మాట్లాడుతూ, ప్రధాని మోదీకి సంబంధించి ఆహ్వాన కార్డు సందేశాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు.
"నా కుటుంబం, నేను కలిసి ఈ ఆలోచన చేశాము అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నర్సింలు తెలిపారు.
నర్సింలు మొదటి వ్యక్తి కాదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ట్రెండ్ మొదలైంది. ప్రధానమంత్రి మోడీ యొక్క తీవ్రమైన మద్దతుదారులు తమ వివాహానికి బహుమతులు వద్దు.. ఎన్నికలలో మోడీకి ఓటు వేయమని వారి అతిథులను కోరడం గురించి అనేక వార్తా నివేదికలు వెలువడ్డాయి. ప్రస్తుతం కూడా అదే జరుగుతోంది.
ఉత్తరాఖండ్‌లోని ఓ వ్యక్తి తన కుమారుడి వివాహ ఆహ్వానపత్రికపై ప్రధాని నరేంద్ర మోదీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ సందేశాన్ని ముద్రించిన వ్యక్తికి ఎన్నికల సంఘం నోటీసులు కూడా అందజేసింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ నోటీసులు అందజేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com