KTR: తెలంగాణ జాతి హీరో కేసీఆర్: కేటీఆర్

KTR: తెలంగాణ జాతి హీరో కేసీఆర్: కేటీఆర్
X
తెలంగాణ భవన్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు... పాల్గొన్న అగ్ర నేతలు

కేసీఆర్ తెలంగాణ జాతికి హీరో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన కొడుకుగా పుట్టడం తన అదృష్టమని వెల్లడించారు. తెలంగాణ భవన్ లో జరిగిన కేసీఆర్ 71వ జన్మదిన వేడుకల్లో 71 కేజీల కేకును హరీశ్ రావుతో కలిసి కేటీఆర్ కట్ చేశారు. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను సాధించారని కేటీఆర్ గుర్తు చేశారు.

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ తొలి సీఎం, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తన్నారు. ఈ వేడుకల్లో భాగంగా 71 కిలోల భారీ కేక్‌ను కట్‌ చేశారు. కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానాన్ని వివరించేలా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. డప్పు కళాకారులు, గిరిజన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ అగ్ర నేతలు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుభాష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు అందజేశారు. పేదల పాలిట పెద్దన్నగా నిలిచాడని నేతలు కొనియాడారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో కేసీఆర్ న మించిన వారు దేశ చరిత్రలో లేరని వారు అన్నారు.

దక్షిణాఫ్రికాలో వేడుకలు

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను దక్షిణాఫ్రికాలో ఘనంగా నిర్వహించారు. జొహన్నెస్‌బర్గ్‌లో బీఆర్‌ఎస్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షులు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు, కమ్యూనిటీ సభ్యులు పాల్గొని కేక్ కట్ చేశారు.

ఆస్ట్రేలియాలో వృక్షార్చన

కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలను ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. వృక్షార్చనతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సిడ్నీ, మెల్‌బోర్న్ , అడిలైడ్, బ్రిస్బేన్ నగరాల్లో కేసీఆర్ దీర్గాయుష్యు కోసం ప్రత్యేక పూజలు, అన్న దాన కార్యక్రమాలు చేశారు.

Tags

Next Story