అఖిలప్రియను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరిన పోలీసులు

అఖిలప్రియను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరిన పోలీసులు

భూవివాదం విషయంలో ముగ్గురి కిడ్నాప్ కేసులో.. భూమా అఖిలప్రియ కస్టడీ కోసం బోయిన్‌పల్లి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అఖిలప్రియను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఆమె అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అఖిల భర్త సహా మిగతా నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. బాధితులతో సంతకాలు చేయించుకున్న దస్త్రాలను కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. నిందితులను అరెస్టు చేశాక.. కిడ్నాప్ సీన్‌ను రీ కన్‌స్ట్రక్షన్‌ కూడా చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే.. రేపటి నుంచి ఈ నెల 15 వరకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.


Tags

Next Story