Etela Rajender : బీజేపీలోకి ఈటెల రాజేందర్..!

Etela Rajender Join In BJP : మాజీ మంత్రి ఈటల రాజేందర్ కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ముఖ్యనేతలతో చర్చలు పూర్తయినట్లు సమాచారం. ఈ విషయంలో గతంలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు కీ రోల్ పోషించారు. అయితే మొదటగా ఈ ప్రతిపాదనకు ఈటెల సానుకూలంగా స్పందించ లేదట. పార్టీలో సముచిత స్థానం వస్తుందని కమలం నేతలు ఆయన ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఈటెలతో చర్చలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని సమాచారం. హుజురాబాద్ ఉపఎన్నికలో గెలవడం కోసం పార్టీ సపోర్ట్ చేస్తుందని ఈటెలకు కమల నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కీలక పోర్టుఫోలియో ఇస్తామని జాతీయ నేతలతో కూడా చెప్పినట్లు సమాచారం. జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డి లతో ఈటెల చర్చలు జరిపినట్లు సమాచారం. ఈటెల చేరిక పై జాతీయ నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఈటెలతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఏనుగు రవీందర్, తుల ఉమ బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఈటల చేరిక ఢిల్లీలోనా లేకా హైదరాబాదులోనా అన్నది ఇంకా నేతలు నిర్ణయించలేదు. అటు ఈటెల బీజేపీలో చేరుతారన్న వార్తలను ఈటెల వర్గం ఖండించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com