నా హత్యకు జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నారు : ఈటల రాజేందర్

X
హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నారని అన్నారు. హంతక ముఠాతో చేతులు కలిపినట్టు తనకు సమాచారం వచ్చిందని తెలిపారు. నరహంతకుడు నయీం చంపుతా అంటేనే భయపడలేదని, ఇప్పుడు కూడా భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడినని, ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడుతానని తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీఎమ్మెల్యే బోడిగ శోభతో కలిసి ఈటల ప్రచారం నిర్వహించారు. దుబ్బాకలో ఏం జరిగిందో హుజురాబాద్‌లోనూ అదే జరుగుతుందని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
