Harish Rao : మండలి చీఫ్‌విప్‌గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం : హరీశ్‌రావు

మండలి చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని ఎలా నియమించారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అన్నారు. పీఏసీ ఛైర్మన్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారని విమర్శించారు.
‘‘భారాసకు చెందిన మహేందర్‌రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇచ్చారు? ఆయనపై ఛైర్మన్ వద్ద ఇప్పటికే అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఛైర్మన్ ఇచ్చిన బులెటిన్(మండలి చీఫ్ విప్‌గా నియమించడం) అనర్హత పిటిషన్‌కు మరింత బలం చేకూర్చింది. దీన్ని కూడా అనర్హత పిటిషన్‌లో సాక్ష్యంగా చేరుస్తాం. ఎమ్మెల్సీ హోదాలోనే ఆగస్టు 15, సెప్టెంబర్ 17న మహేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. మార్చి 15 నుంచే ప్రభుత్వ చీఫ్ విప్ అని బులెటిన్ ఇచ్చారు. దీనిపై సీఎస్‌కు లేఖ రాస్తాం. గవర్నర్, డీవోపీటీకి కూడా లేఖ రాస్తాం. గవర్నర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని హరీశ్‌రావు ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com