Exam Paper Leak : వరుస లీకులు.. కేసీఆర్ సర్కార్ పై విపక్షాలు ఫైర్...

Exam Paper Leak : వరుస లీకులు.. కేసీఆర్ సర్కార్ పై విపక్షాలు ఫైర్...
రెండ్రోజులుగా సోషల్ మీడియాలో టెన్త్‌ పేపర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో విద్యార్థులతో పాటు పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు

టెన్త్‌ పేపర్లు వరుసగా బయటకు రావడంతో తెలంగాణ రాజకీయాలు వేడక్కాయి. సర్కారు తీరుపై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు. ఇప్పటికే TSPSC పేపర్ల లీకేజీ అంశంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది ప్రభుత్వం. ఆ అంశం మరవక ముందే టెన్త్ పరీక్ష పేపర్లు లీక్‌ కావడంతో.. చర్చనీయాంశమైంది. వరుసగా రెండ్రోజులుగా సోషల్ మీడియాలో టెన్త్‌ పేపర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో విద్యార్థులతో పాటు పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర విచారణ చేపట్టింది చర్యలు తీసుకుటోంది. అయితే... ఈ వ్యవహారం... క్రమంగా రాజకీయరంగు పులుకుముంటోంది.

సాధారణంగా ఏ పరీక్షలు నిర్వహించినా కొన్ని పొరపాట్లు జరగడం సహజం. కానీ టెన్త్‌ పేపర్ల లీకేజీలో అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తోంది. TSPSC పేపర్లు లీకేజీతో అలర్టైన ప్రభుత్వం.... టెన్త్‌ పరీక్షలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పింది. కానీ పరీక్షలు ప్రారంభమయ్యాక సీన్ రివర్స్ అయింది. రివ్యూలపై రివ్యూలు చేసినా ఫలితం లేకపోయింది. వరుసగా రెండ్రోజులు పేపర్ బయటకు రావడంతో విద్యార్థులతో పాటు పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం.... విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఒకప్పుడు టెన్త్‌ పరీక్షలంటే కట్టుదిట్టమైన భద్రత, పోలీసుల విస్తృత తనిఖీలు ఉండేవి. కానీ ఇప్పుడు విద్యాశాఖ అధికారుల ఇష్టారాజ్యంగా మారిపోయింది. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను కనీసం మీడియాకి చెప్పడం లేదు. రివ్యూలు నిర్వహించామని ప్రెస్ నోట్ ఇస్తున్నారు.

వాస్తవానికి బోర్డులు గానీ అధికారులు గానీ ఉండేది విద్యార్థుల ప్రయోజనం కోసం మాత్రమే! కానీ విద్యార్థులను కలవడం కాదు కదా కనీసం వారికి సమాచారం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. గత రెండ్రోజులుగా టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే ప్రభుత్వంతో పాటు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వైపు పరీక్ష స్టార్ట్ అయిన నిమిషాల్లోనే ప్రశ్నపత్రాలు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. అటు... రాసిన జవాబు పత్రాలు భద్రపరచడంలోనూ అధికారులు విఫలమవుతున్నారు. ఉట్నూర్ లో ఆటో లోంచి జవాబుపత్రాల బండిల్ పడిపోవడం పట్ల విద్యాశాఖ అధికారులు, సిబ్బంది ఎంతటి నిర్లక్షం ప్రదర్శిస్తున్నారో ఇట్టే అర్ధం అవుతోంది.

టెన్త్‌ పేపర్ల లీక్స్‌తో ... BRK భవన్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లు, SP లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులపై గట్టిగానే ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. పేపర్‌ లీక్ చేసిన ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలని ఆదేశించారు. పరీక్షా పేపర్లు లీక్ కాలేదనీ విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలకు చేపట్టామన్నారు. మిగిలిన పరీక్షల్ని సాఫిగా జరుగుతాయన్నారు. అధికారులు సైతం... సెల్ ఫోన్లతో ఎగ్జామ్‌ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story