తెలంగాణ

శంషాబాద్‌ విమానాశ్రయంలో అద్దెకు ఖరీదైన కార్లు..!

హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఖరీదైన అద్దెకు కార్లు సందడి చేస్తున్నాయి. దేశంలోనే తొలిసారి ఫెరారీ కంపెనీ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది.

శంషాబాద్‌ విమానాశ్రయంలో అద్దెకు ఖరీదైన కార్లు..!
X

హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఖరీదైన అద్దెకు కార్లు సందడి చేస్తున్నాయి. దేశంలోనే తొలిసారి ఫెరారీ కంపెనీ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా చాలా తక్కువ మంది చేతిలో ఉండే ఈ తరహా ఖరీదైన కార్లకు...10 కిలో మీటర్ల ప్రయాణానికి 22వేల రూపాయల అద్దె వసూలు చేస్తున్నారు. ఒక్కో కారు ధర సుమారు ఐదు కోట్ల వరకు ఉంటుంది.

ఈ కార్లను ఎయిర్‌పోర్ట్‌లో... అరైవల్‌ పాయింట్‌ వద్ద హెల్ప్‌ డెస్క్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. కారు బుకింగ్‌కు 1499 నుంచి 5వేల రూపాయల వసూలు చేస్తారు. బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ కార్లలో సెల్ఫ్‌ డ్రైవింగ్‌కు ముందుగా లక్ష డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. కారు అద్దె గంటకు 5వేల రూపాయలు కాగా, గంట దాటితే కిలో మీటర్‌కు అదనంగా 177 రూపాయలు వసూలు చేస్తారు.

ఎయిర్‌పోర్ట్‌లో ఫెరారీ, రేంజ్‌ రోవర్‌, బెంట్లీ, కాంటినెంటల్‌, మెర్సిడేజ్‌ బెంజ్‌, ఫోర్‌ ముస్తాక్‌, ఆడి, వోల్వో, టొయోటో, బీఎండబ్ల్యూ సహా 30కి పైగా మోడళ్ల కార్లు అద్దెకు అందుబాటులో ఉన్నాయి.

Next Story

RELATED STORIES