Hyderabad: హైదరాబాద్‌లో పెట్టుబడులకు ముందుకొచ్చిన మరో సంస్థ.. వారికి సేవలే లక్ష్యంగా..

Hyderabad: హైదరాబాద్ మహా నగరంలో పెట్టుబడుల కోసం మరో సంస్థ ముందుకు వచ్చింది. అమెరికాలో ప్రముఖ ఆడిటింగ్ సంస్థ మూలర్ డాట్ కనెక్ట్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఇండియాలో ఉన్న అమెరికన్ లకు ట్యాక్స్ సేవలు అందించడం కోసం ఈ సంస్థను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. మొదటగా హైదరాబాద్ కేంద్రంగా బ్రాంచ్ ను ఏర్పాటు చేసి ఆ తరువాత టూ టైర్ సిటీ అయిన మహబూబ్ నగర్ లో కూడా త్వరలోనే తమ కార్యకలాపాలను ప్రారంభించబోతున్నట్టు మూలర్ డాట్ కనెక్ట్ అండ్ పీకేఎఫ్ ములార్ సంస్థ ప్రెసిడెంట్ ఫని తెలిపారు.
తమ సంస్థ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే కార్యాలయంకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎంతో సహకారం అందించినట్టుగా ములార్ డాట్ కనెక్ట్ మరియూ పీకేఎఫ్ ములార్ సంస్థ సీఈవో దేవ్ నిస్సెన్ తెలిపారు. మహబూబ్ నగర్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల భాగాస్వామ్యంతో విద్యార్థులకు ట్రైనింగ్ కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నామని చెబుతున్నారు ఫని.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com