Farm House Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టులో విచారణ

Farm House Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవాళ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న పిటీషన్‌పై ఇవాళ వాదనలు జరుగనున్నాయి. సిట్ విచారణ పాదరర్శకంగా జరగడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లే సిట్ నడుచుకుటుందని పిటిషనర్ల తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు.
సీబీఐతో కాని స్వతంత్ర్య దర్యప్తు సంస్థతో కానీ విచారణ జరపాలని కోరుకుంటున్నారు. గత విచారణలో వర్చువల్‌లో వాదనలు వినిపించారు మహేష్ జఠ్మలానీ. సిట్ దర్యాప్తు సక్రమంగా జరుగుతుందంటున్న ప్రభుత్వ న్యాయవాది.. ఇవాళ మరోసారి వాదనలు వినిపించనున్నారు.
మరోవైపు ఇదే కేసులో బీఎల్ సంతోష్ 41 ఏ సీఆర్‌పీసీ నోటీసులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. బీఎల్ సంతోష్‌కు జారీ చేసిన 41 సీఆర్‌పీసీ నోటీసులపై ఇవాల్టితో స్టే ముగియనుంది. దీంతో ఈ పిటిషన్‌పైనా విచారణ జరగనుంది. మరోవైపు ఇదే కేసులో జగ్గుస్వామి నోటీసులపై స్టే అంశంపైనా ఇవాళ విచారణ జరుగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com