Farm House Deal Case: ఫామ్‌హౌస్‌ డీల్‌ కేసు.. వెలుగులోకి నందకుమార్ అక్రమాలు

Nanada Kumar Fraud about farm house deal case
Farm House Deal Case: ఫామ్‌హౌస్‌ డీల్‌ కేసు.. వెలుగులోకి నందకుమార్ అక్రమాలు
X
Farm House Deal Case: ఫామ్‌హౌస్‌ డీల్‌ కేసులో నిందితుడు నందకుమార్‌ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.

Tirupati: ఫామ్‌హౌస్‌ డీల్‌ కేసులో నిందితుడు నందకుమార్‌ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్‌ దర్యాప్తులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. వ్యాపారం పేరుతో పలువురికి నందు చెక్కులు అందజేనట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో చెక్‌బౌన్స్‌ అయినట్లు గుర్తించారు.



ఏడు వ్యాపార సంస్థలను నిర్వహించిన నందు.. మానిక్‌చంద్‌ వివాదంలోనూ తలదూర్చినట్లు గుర్తించారు. సంస్థ ప్రతినిధులతో డీల్‌ మాట్లాడదామని చెప్పి మోసగించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. అటు.. పలువురు స్వామిజీలను టార్గెట్‌ చేసి వారితో ప్రముఖులకు పూజలు చేయించారని తెలుస్తోంది. వ్యాపార వ్యవహారాల్లో డీల్‌ కుదుర్చుకుందామని చెప్పి మోసం చేసినట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడైంది.

Tags

Next Story