నిజామాబాద్ కలెక్టరేట్ ముందు రైతు ఆత్మహత్యాయత్నం..!

నిజామాబాద్ కలెక్టరేట్ ముందు రైతు ఆత్మహత్యాయత్నం..!
తన వ్యవసాయ భూమిని ఇద్దరు వ్యక్తులు కబ్జా చేశారని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజావాణికి వచ్చాడు.

నిజామాబాద్ కలెక్టరేట్‌ ముందు ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన వ్యవసాయ భూమిని ఇద్దరు వ్యక్తులు కబ్జా చేశారని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజావాణికి వచ్చాడు. మనస్తాపంతో ఒంటి పై కిరోసిన్ పోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. దీంతో బాధితుడు సంతోష్ చారిని కలెక్టర్ నారాయణ్ రెడ్డి.. తన ఛాంబర్‌లోకి పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే జరిపించి సమస్యను పరిష్కరిస్తానని బాధితుడికి కలెక్టర్ హామీ ఇచ్చారు.Tags

Next Story