Farmer Suicide: మరో రైతు బలవన్మరణం.. కుటుంబంలోని ఇద్దరు ఏడాది కాలంలోనే..

X
Farmer Suicide (tv5news.in)
Farmer Suicide: అప్పుల బాధతో ఓ వరి రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఉరుకొండ మండలం రాంరెడ్డిపల్లిలో రైతు దశరథ్ 18 ఎకరాలు కౌలుకు తీసుకుని రెండెకరాలలో వరి వేశాడు. అప్పులు భారమై మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు. ఇతని కుటుంబంలో ఏడాది కాలంలోనే ఇద్దరు తమ్ముళ్లు మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
