Kamareddy: ప్రాణం విడిచిన మరో రైతు.. తన ధాన్యం కుప్ప మీదే..

Kamareddy: ప్రాణం విడిచిన మరో రైతు.. తన ధాన్యం కుప్ప మీదే..

ప్రతీకాత్మక చిత్రం (tv5news.in)

Kamareddy: కష్టపడి పనిచేసినా ఫలితం దక్కదు.. పంట పండాలంటే సమయానికి వర్షం రాదు..

Kamareddy: కష్టపడి పనిచేసినా ఫలితం దక్కదు.. పంట పండాలంటే సమయానికి వర్షం రాదు.. చివరికి పంట చేతికి వస్తే దానికి సరైన గిట్టుబాటు ధర రాదు.. ఇవన్నీ మన దేశంలో రైతులు పడుతున్న కష్టాలు ఇవి మాత్రమే కాదు ఇంకా వారు రోజురోజు పడుతున్న కష్టాలు మరెన్నో ఉన్నాయి. ఆ కష్టాలకి ఎదురెళ్లి జీవనం సాగించలేక ఎంతోమంది రైతులు ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా జరిగిన ఒక సర్వేలో రైతుల ఆత్మహత్యల ప్లేస్‌లో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నట్టుగా తేలింది. ఆ జాబితాలోకి మరో రైతు కూడా చేరాడు.

ధాన్యం కొనుగోళ్ల ఆలస్యం ఓ రైతు ప్రాణం తీసింది. కామారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామానికి చెందిన బీరయ్య.. వారం క్రితం లింగంపేట్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చాడు. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంతో.. రోజూ తన ధాన్యం కుప్పల వద్దే రాత్రంతా నిద్రపోతున్నాడు. నిన్న రాత్రి ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ధాన్యం కుప్ప మీదే కుప్పకూలిపోయాడు. ఇది ఆత్మహత్య కాదు.. కానీ తన ధాన్యాన్ని అలా చూడలేక బీరయ్య ప్రాణాలు విడిచాడు. బీరయ్య మృతికి నిరసనగా ధాన్యం కొనుగోలు వద్దే రైతులు ఆందోళనకు దిగారు.

Tags

Read MoreRead Less
Next Story