నల్గొండ జిల్లాలో రోడ్డెక్కిన అన్నదాతలు

నల్గొండ జిల్లాలో రోడ్డెక్కిన అన్నదాతలు
రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం మొత్తం తడిసి ముద్ద అయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా నకిరేకల్‌ కడపర్తి రోడ్డును గంటసేపు దిగ్భంధం చేశారు.

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో అన్నదాతలు రోడ్డెక్కారు. నెల రోజుల క్రితం మార్కెట్‌ యార్డుకు తాము ధాన్యం తెచ్చినా.. అధికార నిర్లక్ష్యం వల్ల కొనుగోలు చేయలేదని.. చివరికి నిన్న రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం మొత్తం తడిసి ముద్ద అయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా నకిరేకల్‌ కడపర్తి రోడ్డును గంటసేపు దిగ్భంధం చేశారు. తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని... మద్ధతు ధర కేటాయించాలని రైతులు డిమాండ్‌ చేశారు. రైతుల ధర్నా విషయం తెలుసుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి... రైతుల పక్షాన నిరసన చేపట్టారు. మండుటెండలో కూర్చొని దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. స్థానిక తహశీల్దార్‌, మార్కెట్‌ కమిటీ అధికారులను పిలిపించుకుని రైతులకు జరిగిన నష్టంపై చర్చించారు.

Tags

Read MoreRead Less
Next Story