పాఠశాలలకు పండగ సెలవులు.. దసరా హాలిడేస్ లిస్ట్ ప్రకటించిన తెలంగాణ

పాఠశాలలకు పండగ సెలవులు.. దసరా హాలిడేస్ లిస్ట్ ప్రకటించిన తెలంగాణ
అంబరాన్నంటే దసరా సంబరాలకు తెలంగాణ ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా విద్యార్ధులకు ప్రభుత్వం సెలవుల లిస్ట్ ప్రకటించింది.

అంబరాన్నంటే దసరా సంబరాలకు తెలంగాణ ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా విద్యార్ధులకు ప్రభుత్వం సెలవుల లిస్ట్ ప్రకటించింది. పాఠశాలలకు అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 25 వరకు, జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 19 నుండి 25 వరకు ఏడు రోజులు సెలవులను ప్రకటించాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 13 రోజుల పాటు సెలవులను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది.

గతేడాది తెలంగాణలో దసరా సెలవులు 14 రోజులు. ఈ ఏడాది దాన్ని 13కి కుదించి అక్టోబర్ 26న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 24న దసరా, అక్టోబర్ 22న బతుకమ్మ పండుగ జరుపుకోనున్న శుభసందర్భంలో తెలంగాణ విద్యాశాఖ సెలవులు ప్రకటించింది.

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అన్ని జూనియర్ కాలేజీలు సెలవు షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాలని, సెలవులలో ఎటువంటి తరగతులు నిర్వహించవద్దని ఆదేశించింది. కళాశాలలు ఆదేశాలను పాటించేలా చూడాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారులను కోరింది.

Tags

Next Story