Adilabad: బిర్యానీ కోసం అంత పని చేశారా..! మద్యం మత్తులో..

Adilabad: బిర్యానీ కోసం కొందరు యువకులు రెచ్చిపోయారు.. మద్యం మత్తులో హోటల్ యజమానిపై దాడికి పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని సురబి గ్రాండ్ హోటల్‌కు పట్టణానికి చెందిన 47వ వార్డు కౌన్సిలర్ భర్త, బీజేపీ నాయకులు సోము రవి మరి కొందరు నాయకులు, కార్యకర్తలు అనంతరం వారు బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా.. అయిపోయిందని హోటల్ మేనేజర్ రాజన్న వారికి తెలిపాడు.
దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే మధ్యలో జోక్యం కేసుకున్న హోటల్ యజమాని.. వాళ్లకు బిర్యానీ ఇవ్వాలని సూచించారు. దీంతో హోటల్‌లో మిగిలిన బిర్యానీని వారికి అందించారు. అయితే ముందు బిర్యానీ లేదని చెప్పి.. తర్వాత ఎలా ఇచ్చారంటూ సదరు యువకులు అసభ్య పదజాలంతో హోటల్ యజమానిని, ఇతర సిబ్బందిని దూషించారు.
దీంతో ఇరువురి మధ్య మళ్లీ వాగ్వాదం చోటుచేసుకోగా... హోటల్ యజమానిపై యువకులు కర్రలతో దాడి చేశారు. రాళ్లతో హోటల్ అద్దాలు పగులగొట్టారు. ఈ దాడిలో చంద్రకాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com