నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్లకు ముగిసిన ఉపసంహరణ గడువు

X
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 19 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఫైనల్‌గా ఉప ఎన్నికల బరిలో 41 మంది అభ్యర్థులు నిలిచారు. సాగర్ బైపోల్‌కు మొత్తం 77 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్లు స్క్రూట్నీ చేసిన అధికారులు.. 17 నామినేషన్లను తిరస్కరించారు. మరో 19 మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో.. బరిలో 41 మంది నిలిచారు.
ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి డాక్టర్. రవి కుమార్ బరిలో ఉన్నారు. ఈనెల 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెల్లడిస్తారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
