Telangana: కులవృత్తులకు ఆర్థిక సాయం

తెలంగాణలోని BC కులవృత్తులకు ఆర్థిక సాయానికి సంబంధించి విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లో ఖరారు చేయనుంది. ఈ మేరకు CM KCRను కలిసిన మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షుడు, BC సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్.. విధివిధానాల రూపకల్పనకు సంబంధించిన కసరత్తును వివరించారు. రెండ్రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. కులవృత్తులకు చేయూత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.
కులవృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయీబ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. లక్ష రూపాయల చొప్పున దశల వారీగా ఆర్థిక సాయం అందిస్తామన్నారుూ CM KCR . త్వరితగతిన విధివిధానాలు ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సందర్భంగా పథకాన్ని ప్రారంభించాలని మంత్రి గంగుల కమలాకర్‌ను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com