తెలంగాణ

స్కూల్‌లో అగ్ని ప్రమాదం.. మంటలను చూసి పక్క భవనంపైకి దూకిన విద్యార్థులు

మంటలను చూసి కొంతమంది భయంతో పరుగులు తీశారు.

స్కూల్‌లో అగ్ని ప్రమాదం.. మంటలను చూసి పక్క భవనంపైకి దూకిన విద్యార్థులు
X

హైదరాబాద్‌ గౌలిపురాలోని శ్రీనివాస స్కూల్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో స్కూలు ఆఫీసు రూం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో స్కూల్‌లో 40 మంది విద్యార్థులు ఉన్నారు.

మంటలను చూసి భయంతో పరుగులు తీశారు. కొందరైతే... ఆ స్కూల్‌ రెండో అంతస్తు నుంచి పక్క భవనంపైకి దూకారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది... మంటలను అదుపు చేశారు. స్థానికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని అంచనా వేస్తున్నారు.Next Story

RELATED STORIES