GUN FIRE: గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు

GUN FIRE:  గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు
X
కానిస్టేబుల్‌కు బుల్లెట్‌ గాయం... మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్‌

గచ్చిబౌలిలో కాల్పులు కలకలం రేపాయి. ప్రిజమ్ పబ్లో ఓ దొంగ చొరబడ్డాడు. అతడిని పట్టుకునేందుకు సీసీఎస్ కానిస్టేబుల్ వెంకటరామ్ రెడ్డి ప్రయత్నించాడు. ఒక్కసారిగా గన్ తీసిన దుండగుడు కానిస్టేబుల్ మీదకు రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఓ బుల్లెట్ వెంకటరామ్ రెడ్డి తొడలోకి చొచ్చుకెళ్లింది. అతడిని ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ అని తేలింది.

చిత్తూరు జిల్లా వడ్డిపల్లి

ప్రభాకర్‌‌ది చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామం. నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా చోరీ కేసులున్నాయి. తాజాగా గచ్చిబౌలి ప్రిజం పబ్‌లోనే కానిస్టేబుల్ బత్తుల ప్రభాకర్‌పై కాల్పులు జరిపారు. పబ్‌లో సైబరాబాద్ సీసీఎస్ పోలీసుల తనిఖీలు చేశారు. దీంతో పోలీసులను చూసిన వెంటనే ప్రభాకర్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పబ్‌లోని బౌన్సర్‌కు సైతం గాయాలు అయినట్లు తెలుస్తోంది. దీంతో పబ్ సిబ్బంది వెంటనే స్పందించి.. కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్‌ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. 2022లోనే బత్తుల ప్రభాకర్ విశాఖ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు. తాజాగా కాల్పుల ఘటనతో ప్రభాకర్ మళ్లీ వెలుగులోకి వచ్చాడు.


పోలీసుల స్పందన ఇదే

గచ్చిబౌలి కాల్పలు ఘటనపై మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్పందించారు. బత్తుల ప్రభాకర్ అనే పాత నేరస్తుడు ప్రిజం పబ్ దగ్గర పోలీసులపై ఫైర్ చేశాడని తెలిపారు. ఈ ఘటనలో వెంకట్ రెడ్డి అనే కానిస్టేబుల్‎కి గాయాలు అయ్యాయన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని.. నిందితుడిపై రాబరీ కేసులు కూడా ఉన్నాయని తెలిపారు. 2023 నవంబర్ నుంచి ప్రభాకర్ పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలోని ప్రభాకర్ గచ్చిబౌలిలోని ఓ పబ్బుకు వచ్చాడని సమాచారంతో పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లారని.. నిందితుడి కాల్పుల్లో సీసీఎస్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని చట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు తుపాకీలను, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గాయపడిన కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. దర్యాప్తు తర్వాత మరిన్ని విషయాలు వెల్లడిస్తామని డీసీసీ వినీత్ పేర్కొన్నారు.

Tags

Next Story