రెండో భార్యతో భర్త.. చితకబాదిన మొదటి భార్య !

మొదటి భార్యను ఉండగానే గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకొని కాపురం పట్టిన భర్తను పట్టుకొని దేహశుద్ది చేసింది మొదటి భార్య.. ఈ ఘటన సోమవారం కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా ముఠాకొండూరు మండలం చేర్యాల గ్రామానికి చెందిన పరశురాం బోర్‌వేల్స్ వ్యాపారం చేస్తుంటాడు. పరశురాంకి, ధనలక్ష్మీతో కొన్నేళ్ళ క్రితం వివాహం జరిగింది.
వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అయితే వ్యాపరం నిమిత్తం అన్ని ప్రాంతాలకు తిరిగే పరుశురాం.. మూడు నెలలుగా ఇంటికి తిరిగి వెళ్లలేదు. దీనితో అనుమానం వచ్చి ఆరా తీయగా.. కామారెడ్డికి చెందిన కవిత అనే ఓ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుని అశోక్‌నగర్‌లో ఉంటున్నాడని తెలిసింది.
దీనితో ధనలక్ష్మి సోమవారం బంధువులతో కలిసి వచ్చి భర్తను చితకబాదింది. తనకు మాయమాటలు చెప్పి అన్యాయం చేశాడని పరుశురాం రెండో భార్య కవిత ఆరోపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com