Crime News: పండుగ వేళ తీవ్ర విషాదం
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఐదుగురు మరణించగా.. ఇద్దరిని స్థానికులు కాపాడారు.. చనిపోయిన వారంతా 20 ఏళ్లలోపు వారే ఉండడంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన యువకులు శనివారం కొండపోచమ్మ సాగర్ డ్యాం వద్దకు వెళ్లారు. ఈత కొట్టెందుకు రిజర్వాయర్ లో దిగి.. అంతా మునిగిపోయారు.. ఏడుగురు యువకులు గల్లంతవ్వగా... ఐదుగురు నీట మునిగి చనిపోయారు.. ఇద్దరిని.. స్థానికులు కాపాడారు. మృతులు ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ధనుష్ (20), లోహిత్ (లక్కీ) (17), చీకట్ల దినేశ్వెర్ (17), సాహిల్ (19), జతిన్ (17) గా గుర్తించారు.. కోమరి మృగంక్, ఎండి ఇబ్రహీం ఇద్దరూ బయటపడ్డారు. పండగ ముందు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు.
చనిపోయిన ఐదుగురు యువకుల వివరాలు
1. ధనుష్ s/o నర్సింగ్, వయస్సు 20 సంవత్సరాలు, ఫోటో స్టూడియో వర్కర్
2. లోహిత్ s/o నర్సింగ్, వయస్సు 17 సంవత్సరాలు(ధనుష్ సోదరుడు)
3. చీకట్ల దినేశ్వర్ s/o కిషన్, వయస్సు 17 సంవంత్సరాలు
4. సాహిల్ s/o దీపక్ సుతార్, వయస్సు 19 సంవత్సరాలు
5. జతిన్ s/o గోపీనాథ్, వయస్సు 17 సంవత్సరాలు, డిప్లొమా, ఖైరతాబాద్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com