Floccinaucinihilipilification : మంత్రి కేటీఆర్, శశిథరూర్ మధ్య హాస్యాస్పద ట్వీట్..!

Floccinaucinihilipilification: కొవిడ్ మందుల (పొసాకోనాజోల్, క్రెసెంబా, టోసిల్‌జుమాబ్, రెమ్‌డెసివిర్, లైపోసోమాల్, ఆంఫోటెరెసిన్, ఫ్లావీపిరవిర్, మోల్నూపిరవిర్, బరిసిటినిబ్.. ఇలా ) పేర్లు పలికేందుకు కష్టంగా ఉన్నాయని, వీటికి పేర్లు పెట్టడంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ హస్తం ఉందా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై శశిథరూర్ స్పందించారు. 'అందులో తప్పులేదు. అలాంటి అవసరంలేని వాటిలో మీరెందుకు తలమునకలవుతారు. నాకు వదిలేయండి. కరొనిల్, కరొజీరో, గోకరోనాగో అంటూ సంతోషంగా పిలుచుకుంటాను' అంటూ Floccinaucinihilipilification (29 అక్షరాలతో కూడిన) మరో కఠిన పదాన్ని ప్రయోగిస్తూ ట్వీట్ చేశారు. ఆంగ్లంలో పాండిత్యం అధికంగా ఉన్న నేతగా శశిథరూర్‌కు పేరుంది. ఈ క్రమంలో కేటీఆర్ థరూర్ జోక్ చేయగా, ఆయన భారీ పదాలతో బదులిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com