హైదరాబాద్‌లో మీసేవ కేంద్రాలకు వరద బాధితుల తాకిడి

హైదరాబాద్‌లో వరద పరిహారం అందని వారు మీసేవ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా మీ సేవ కేంద్రాలు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడంతో బాధితులు క్యూ కడుతున్నారు. అటు జీహెచ్‌ఎంసీ పరిధిలో వరద సాయం పంపిణీపై ఎస్‌ఈసీ కూడా స్పష్టతనివ్వడం.. డబ్బులు నేరుగా బాధితుల అకౌంట్లలో జయ చేయాలని చెప్పడంతో లైన్ క్లియర్ అయినట్లయింది. సాయం అందుకునేందుకు జనమంతా మీ సేవ సెంటర్లకు క్యూ కడుతున్నారు.
వరదసాయం కోసం కవాడిగూడలో మీ సేవ కేంద్రాల వద్ద జనం గంటల తరబడి నిల్చున్నారు. వందల సంఖ్యలో తరలివచ్చిన ప్రజల తాకిడిని తట్టుకోలేక.. మీ సేవ కేంద్రాల నిర్వాహకులు మూసివేశారు. దరఖాస్తులు ఎందుకు తీసుకోవడం లేదంటూ మీ సేవ కేంద్రాల నిర్వాహకులతో జనం వాగ్వాదానికి దిగారు. ముషీరాబాద్ నియోజవర్గం పరిధిలోని రాంంనగర్ డివిజన్‌లోనూ మీ సేవ కేంద్రాల వద్ద వరద బాధితులు బారులుతీరారు.
మేడ్చల్ ప్రాంతంలోనూ మీ సేవ కేంద్రాలకు వరద బాధితులు పోటెత్తారు. వందల సంఖ్యలో ప్రజలు మీ సేవా కేంద్రాల వద్ద క్యూకట్టారు. భారీగా తరలివచ్చిన జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు సవాలుగా మారింది. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించడంతో కంప్యూటర్లు మొరాయిస్తున్నాయి. మీ సేవ కేంద్రాల వద్ద ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com