Hyderabad: కాటేదాన్‌ లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

Hyderabad: కాటేదాన్‌ లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు
X
ఫుడ్ సేఫ్టీ జోనల్ అధికారి జ్యోతిర్మయి, డీసీసీ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆహార తయారీ పరిశ్రమలు లక్ష్యంగా చేసుకుని తనిఖీలు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని కాటేదాన్‌ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం దాడులు చేశారు. ఫుడ్ సేఫ్టీ జోనల్ అధికారి జ్యోతిర్మయి, డీసీసీ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆహార తయారీ పరిశ్రమలు లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహించారు. 4బృందాలుగా విడిపోయిన అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అల్లం వెల్లుల్లి, చాక్లెట్‌, కుర్‌కురే తయారీ పరిశ్రమల్లో సోదాలు చేశారు. అయితే పలు ఆహార పదార్థాల్లో నాణ్యతా లోపం ఉన్నట్లు గుర్తించారు. పలు ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించిన అధికారులు.. టెస్టింగ్‌ కోసం ల్యాబ్‌కు పంపించారు. ఇక రిపోర్ట్స్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. కల్తీ ఆహార పదార్థాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags

Next Story