HMDA: HMDA విజిలెన్స్ మాజీ డీఎస్పీపై కేసు నమోదు.. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ..

X
HMDA (tv5news.in)
By - Divya Reddy |15 Dec 2021 11:00 AM IST
HMDA: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుతో HMDA విజిలెన్స్ మాజీ డీఎస్పీ జగన్‌పై కేసు నమోదు అయ్యింది.
HMDA: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుతో HMDA విజిలెన్స్ మాజీ డీఎస్పీ జగన్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పది ప్రాంతాల్లో ఏకకాలంలో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. HMDA విజిలెన్స్ డీఎస్పీగా ఉన్న సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు జగన్‌పై ఆరోపణలు వచ్చాయి. 2019లో విజిలెన్స్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన జగన్ పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు గత నవంబర్‌లో ఆయన్ను డీజీపీ ఆఫీస్‌కి అటాచ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com