బ్యాట్ పట్టిన మాజీ మంత్రి.. !

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి బ్యాట్ పట్టారు. ఎప్పుడూ తన మాటలతో ప్రత్యర్థులకు వాగ్బాణాలు సంధించే ఆయన.. ఈసారి మాత్రం బ్యాటుతో సమాధనం చెప్పారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా హాలియాలో క్రికెట్ పోటీలను జానారెడ్డి ప్రారంంభించారు. అనంతరం యువకులతో కాసేపు క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. బ్యాట్ పట్టుకొని సరదాగా ఫోటోలకు ఫోజులిచ్చారు జానారెడ్డి. జానారెడ్డి బ్యాటింగ్ చేయడంతో యువకులు చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. అటు నాగార్జున సాగర్ బై పోల్ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఓటర్లకు మరింత దగ్గరయ్యే పనిలో పడ్డారు జానారెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com