Formula E : ఫార్ములా ఈ రేసింగ్‌కు సర్వం సిద్ధం

Formula E : ఫార్ములా ఈ  రేసింగ్‌కు సర్వం సిద్ధం
శుక్రవారం సాయంత్రం ఫ్రీ ప్రాక్టీస్ రేస్‌తో పార్ములా ఈ రేస్ ప్రారంభం

మరికొన్నిగంటల్లో హైదరాబాద్‌ నడిబొడ్డున మెగా ఈవెంట్‌ ప్రారంభంకాబోతుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌కు భాగ్యనగరం సిద్ధమ య్యింది. సాయంత్రం ఫ్రీ ప్రాక్టీస్ రేస్‌తో పార్ములా ఈ రేస్ ప్రారంభం కానుంది. హుస్సేన్ సాగర్ తీరాన జరగనున్న వరల్డ్ ఛాంపియన్ షిప్ కార్ రేసింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఎన్టీఆర్ గార్డెన్, సచివాలయం, మింట్ కంపౌండ్, ఐమాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్లతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది స్ట్రీట్ సర్క్యూట్‌ను సిద్ధం చేశారు.

సాయంత్రం 4గంటల 30నిమిషాలకు మొదటి ఫ్రీ ప్రాక్టీస్ రేస్‌ జరగనుంది. రేపు ఉదయం 8గంటల 10నిమిషాల నుండి 8గంటల 40నిమిషాల వరకు రెండవ ఫ్రీ ప్రాక్టీస్, 10గంటల నుండి 12 గంటల 5నిమిషాల వరకు క్యాలిఫైంగ్ రౌండ్, మధ్యాహ్నం 3గంటల 4నిమిషాలకు ప్రధాన రేసు ప్రారంభంకానుంది. మొత్తం 11 రేసింగ్ కార్లు పాల్గొననుండగా 22 మంది డ్రైవర్లు తమ సత్తా చాటను న్నారు. బ్యాటరీతో నడిచే ఈ కార్లు గరిష్టంగా గంటకు 340 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. 3 సెకన్లలో 62 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కాగా.. ఇండియా నుండి పోటీలో పాల్గొనే మహేంద్ర కంపెనీ తయారు చేసిన ఫార్ములా ఈ కార్‌ను మంత్రి కేటీఆర్ పరిశీలించారు.

ఫార్ములా ఈ కార్ రేస్‌లో స్ట్రీట్ సర్క్యూట్‌కు ఇరువైపులా భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. 22వేల 500మంది రేసును వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. బుక్ మై షో యాప్‌లో టికెట్లను అందుబాటులో ఉంచారు. టికెట్ ధర వెయ్యి రూపాయల నుంచి లక్ష 25వేల రూపాయల వరకు నిర్ణయించారు. ఐమాక్స్ పక్కన కార్ల షెడ్లతోపాటు వీఐపీల గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇక ఫార్ములా ఈ రేసుతో రెట్టింపు జోష్ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన డ్రైవర్లు , కార్లతో నగరంలో సందడి చేస్తున్నారు.

రేసింగ్ నిర్వహించే హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, మింట్ కంపౌండ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. రేస్ చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం 17ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 300మంది పోలీసులు, 270మంది ట్రాఫిక్ పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇవాళ, రేపు సికిం ద్రాబాద్-ట్యాంక్ బండ్ వైపు మార్గాలను కూడా మూసీ వేయనున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు అదనంగా 500 నుంచి 600 మందిని రంగంలోకి దింపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story