Karimnagar: కరీంనగర్ జిల్లాలో అంతు చిక్కని వ్యాధి.. నెల రోజుల వ్యవధిలో నలుగురు మృతి

Karimnagar: కరీంనగర్ జిల్లాలో అంతు చిక్కని వ్యాధి.. నెల రోజుల వ్యవధిలో నలుగురు మృతి
Karimnagar: కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబం మరణం మిస్టరీగా మారింది. అంతుచిక్కని వ్యాధితో కుటుంబంలోని సభ్యులు వరసగా మృతిచెందారు.

Karimnagar: కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబం మరణం మిస్టరీగా మారింది. అంతుచిక్కని వ్యాధితో కుటుంబంలోని సభ్యులు వరసగా మృతిచెందారు. గంగాధరకు చెందిన శ్రీకాంత్, అతని భార్య మమతతో పాటు కూతురు అమూల్య, అద్వైత్ ఒకరి తరువాత ఒకరు మరణించారు.


నెల రోజు వ్యవధిలోనే ఈ మరణాలు సంభవించాయి. అయితే కుటుంబం మిస్టరీ డెత్స్ లో మరో కోణం ఉందని అంటున్నారు మృతుల కుటుంబ సభ్యలు. అత్త మామల వేధింపులతోనే శ్రీకాంత్‌ సూసైడ్‌ చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు..భార్య, పిల్లల మరణంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్‌ నిద్ర మాత్రలు మింగి చనిపోయాడని అంటున్నారు.


అయితే పోస్ట్‌మార్టం తరువాతే ఫుల్‌ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మృతుల బ్లడ్‌ శాంపిల్స్‌ను పుణే ల్యాబ్‌కి పంపించారు అధికారులు. అంతుచిక్కని వ్యాధితో గ్రామంలో మరణాలు సంభవిస్తున్నాయని గంగాధర మండలంలో భయాందోళనలు నెలకొన్నాయి.

Tags

Next Story