REVATH: మరిన్ని పెట్టుబడులు పెట్టండి

REVATH: మరిన్ని పెట్టుబడులు పెట్టండి
X
ఫ్యాక్స్‌కాన్‌ కంపెనీ ప్రతినిధులకు సీఎం రేవంత్ పిలువు

ఎలక్ట్రానిక్, లిథియం బ్యాటరీల వినియోగం దేశమంతా పెరుగుతుందని, ఆ రంగంలో వస్తున్న అవకాశాలను వినియోగించుకుని అనుగుణమైన ప్లాంట్‌లను రాష్ట్రంలో నెలకొల్పాలని ఫాక్స్‌కాన్ ప్రతినిధులను సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. ప్రభుత్వం తరఫున అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించడానికి సిద్ధం అన్నారు. కొంగరకలాన్‌లో నిర్మాణమవుతున్న ఫాక్స్‌కాన్ టెక్నాలజీ ఫ్యాక్టరీ పురోగతిపై ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం సమీక్షించారు. . కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ఎలక్ట్రిక్‌, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కొంగరకలాన్ లో ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సమావేశమై కంపెనీ పురోగతి, ఇతర అంశాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో ఫాక్స్ కాన్ కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేశారు.


లక్ష ఉద్యోగాలు

ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ మ్యానుఫ్యాక్చర్, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అయిన హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్స్‌లోని ఫ్యాక్స్‌కాన్ కంపెనీ తెలంగాణలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్‌లో సుమారు 250 ఎకరాల్లో.. యాపిల్ ఐఫోన్ మేకర్ ఫ్యాక్స్‌కాన్ కంపెనీ తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో 2023, మే 15న భూమి పూజ కూడా చేసింది. కాగా.. ప్లాంట్ నిర్మాణం శరవేగంగా జరుపుకుని.. ప్రారంభానికి సిద్ధమైంది. కంపెనీ పూర్తయితే.. 25,000 ఉద్యోగాలే కాదు.. లక్ష మందికి పైగా ఉపాధి దొరకనుంది. దీంతో.. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో భారీ ఊరట లభించనుంది. ఫ్యాక్స్‌కాన్ కంపెనీ ప్రారంభమైతే.. అటు ఉపాధి అవకాశాలు మెరుగవటమే కాకుండా.. టెక్ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌ సామర్థ్యం మరింత మెరుగుపడనుంది. మరిన్ని అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు హైదరాబాద్‌కు వచ్చేందుకు దోహదపడే అవకాశం కూడా ఉంది. ఈ కంపెనీ ద్వారా వేల నుంచి దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు రానున్నాయని స్వయంగా ఫాక్స్ కాన్ సీఈఓ యంగ్ లియు వెల్లడించారు. 2023 మార్చిలో తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లుగా ఫాక్స్ కాన్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, ఉపకరణాలు తయారు చేసే సంస్థ సంబంధిత కర్మాగారాలను ఏర్పాటు చేసి, ఒక లక్ష ఉద్యోగాలను కల్పిస్తామనే హామీతో రేవంత్ ప్రభుత్వంతో అప్పట్లోనే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దశలవారీగా ఉద్యోగాలు కల్పించనుంది. యాపిల్ ఐ ఫోన్లను ఫాక్స్‌కాన్ సంస్థ తయారు చేస్తుంది.

గతంలో కేసీఆర్‌తో చర్చలు

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో.. 2023 మార్చి 3న అప్పటి సీఎం కేసీఆర్‌తో ఫాక్స్ కాన్ కంపెనీ సీఈఓ యంగ్ లియు ఎంవోయూ చేసుకున్నారు. కొంగర్‌కలాన్‌లోని 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటుకు ఫాక్స్‌కాన్ నిర్ణయం తీసుకుంది. సుమారు లక్ష మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా.. తమ పెట్టుబడి ఉండనుందని ఫాక్స్ కాన్ సంస్థ సీఈఓ యంగ్ లియు అప్పుడు ప్రకటించారు.

Tags

Next Story