భాగ్యనగర వాసులకు ఉచితంగా 'చాయ్ బిస్కెట్'..

X
By - prasanna |16 March 2021 2:28 PM IST
హాస్పిటల్‌కి సమీపంలో 'లూ కేఫ్' ఫౌండేషన్ సిబ్బంది ఓ చాయ్ బడ్డీని ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ ఎదురుగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కి సమీపంలో 'లూ కేఫ్' ఫౌండేషన్ సిబ్బంది ఓ చాయ్ బడ్డీని ఏర్పాటు చేశారు. ఈ స్టాల్‌ను రవీంద్రనాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇగ్జోరా కార్పొరేట్ సేవల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా లూ కేఫ్ హెడ్ అభిషేక్ బంది వాడేకర్ మాట్లాడుతూ.. హాస్పిటల్ పరిసర ప్రాంతాలకు ప్రతి నిత్యం వందల మంది నగర వాసులు వస్తుంటారు. వారందరికీ ఉచితంగా చాయ్ బిస్కట్, మంచి నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ కౌంటర్‌ను ప్రారంభించామని తెలిపారు. అంతే కాకుండా ఇక్కడ మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా పరిశుభ్రమైన వాష్ రూమ్ అందుబాటులో ఉన్నాయన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com