TSRTC: ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నవారికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

TSRTC: ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నవారికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
TSRTC: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీఎస్ఆర్టీసీ ప్రయాణీకులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది.

TSRTC: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీఎస్ఆర్టీసీ ప్రయాణీకులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. అయితే ఇకపై కూడా ఈ సౌకర్యాన్ని కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

ఏదైనా అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చూపించుకోవడానికి వెళ్లి.. వైద్యులను సంప్రదించి తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు 2 గంటల వరకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఆస్పత్రిలో వైద్యులు రాసిన మందుల చిట్టీపైన సమయాన్ని సూచిస్తారు. ఆ చిట్టీని కండక్టర్‌కు చూపిస్తే ఉచితంగా ప్రయాణించే వీలుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడివరకైనా ఇలా ఉచితంగా చేరుకోవచ్చు.

దూరప్రాంతాల నుంచి నగరానికి టీఎస్ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణీకులకు కూడా ఈ అవకాశం కల్పించింది. ఎంజీబీఎస్‌తో పాటు నగరంలో ఎక్కడ దిగినా తర్వాత 2 గంటలు సిటీ బస్సులో ఉచితంగా ప్రయాణించొచ్చని రంగారెడ్డి ఆర్టీసీ రీజియన్ మేనేజర్ సామ్యూల్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story